‘రాజి’ ట్రైలర్ రిలీజ్..

210
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తూ మేఘనా గుల్లర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజి’ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ప్రముఖ కథ రచయిత హరీందర్ సిక్కా రచించిన ‘కాలింగ్ సెహమత్ ‘ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆలీయ భట్ భారతీయ ఆర్మీకి గుఢచారిగా నటిస్తున్నారు.

Raazi Movie Trailer

ఇక సినిమా కథ విషయానికొస్తే 1971 నాటి భారతీయ ఆర్మీకి గూఢచారిగా విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ అమ్మాయిని పాకిస్తాని యువకునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసి పాకిస్థాన్ కు వెళుతుంది. అక్కడికి వెళ్లికూడా భారత సైన్యానికి కావాల్సిన కీలకమైనటువంటి సమాచారాల్ని చేరవేస్తున్న క్రమంలో ఆమె ఎలాంటి కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కుందనేదే ఈ సినిమా స్టోరీ.

ఈ చిత్రంలో ఆలియా ‘సెహమత్’ అనే పాత్రలో నటించారు. ఆమెకు జోడీగా విక్కీ కౌశల్ కలిసి, కూతురుగా, భార్యగా, గూఢచారిగా ఇలా ఇన్ని పాత్రలో కనిపించి నటిస్తున్నారు. ఆలియా భట్ తన మిగతా చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ట్రైలర్ లో తన భర్తకు గున్ను ఎక్కిపెట్టి ‘దేశం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు. ఆఖరికి నువ్వు కూడా’ అని సాగే డైలాగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించారు. అలియా భట్ తన అద్భతమైన నటను చూడాలంటే మే 11 వరకు ఆగాల్సిందే.

- Advertisement -