Raayan:రాయన్ రిలీజ్‌పై క్లారిటీ..

10
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్ సూపర్ స్టార్ ధనుష్ ల్యాండ్‌మార్క్ 50వ చిత్రం’ రాయన్‌’. సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందించారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఎట్టకేలకు సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పాటకు మంచి స్పందన వచ్చింది.

డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న రాయన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్‌ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ రిలీజ్ చేయనుంది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Also Read:జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్..

- Advertisement -