బాలయ్యతో మూవీ భయమేసింది : రాశీ

563
rashi
- Advertisement -

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాశీ. బాలగోపాలుడు సినిమాతో చైల్డ్ఆర్టిస్టుగా పరిచయం కాగా ఈ సినిమాలో హీరోగా బాలయ్య నటించారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. కృష్ణబాబు సినిమాలో బాలయ్యతో నటించాను…ఆ సమయంలో చాలా భయపడ్డానని కానీ తాను కారు దిగి సెట్‌కు వెళ్లే సమయంలో ముందుగా విష్ చేసి తనను ఆహ్వానించారని తెలిపింది. బాలయ్య చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది రాశి.

గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలు రాశికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రాశి..ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

- Advertisement -