రాశి కీలకపాత్రలో వస్తున్న “లంక”

265
Raashi Starring "Lanka" First Look Released
- Advertisement -

నిన్నటితరం అందాల భామ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “లంక”. శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ.. “రాశీ లాంటి సీనియర్ హీరోయిన్ తో సినిమా చేసే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాశీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా.. భారీ క్యాస్టింగ్ మరియు టెక్నీషియన్స్ తో రూపొందించాం” అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీముణి మాట్లాడుతూ.. “శివరాత్రి సందర్భంగా “లంక” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాం. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.
Raashi Starring "Lanka" First Look Released
రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని

- Advertisement -