ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ చిత్ర బృందం ‘37’ అనే సంఖ్యతో కూడిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ వెనుకున్న అసలు రహస్యాన్ని మేకర్స్ వెల్లడించారు.
‘రాకా’ మూవీ టీమ్ మోషన్ క్యాప్చర్ (Mocap) సాంకేతికతను ఉపయోగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన “రియల్ టైమ్‌లో అత్యధిక మంది వ్యక్తుల మోషన్ క్యాప్చర్” విభాగంలో ఈ రికార్డు నమోదైంది. గతంలో ఒకే సమయంలో 19 మందిపై మోషన్ క్యాప్చర్ చేసినదే ప్రపంచ రికార్డుగా ఉండగా, ఇప్పుడు ‘రాకా’ చిత్ర బృందం ఏకంగా 37 మందితో ఈ సాంకేతిక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి పాత రికార్డును తిరగరాసింది. పోస్టర్‌లోని ‘37’ సంఖ్యకు అసలు అర్థం ఇదేనని స్పష్టమైంది.
ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించిన ‘మోషన్ క్యాప్చర్ గ్లింప్స్’ మరియు ‘మేకింగ్ వీడియో’ను అట్లీ బర్త్‌డే ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక వినూత్న ప్రయత్నంగా నిలవనుంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మరియు ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తికానుండగా, ప్రపంచవ్యాప్తంగా 2028లో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read:‘హాఫ్’కు TIFFలో అరుదైన ఘనత..

