వేసవిలో చాలా త్వరగా డీహైడ్రేట్ బారిన పడుతుంటాము. దాంతో శరీరానికి అలసట, అసమర్థత ఆవహిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో శరీరానికి సరైన పోషకాలు ఎంతో అవసరం. అలాంటి పోషకలకు నిలయం రాగిజావా అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ రాగిజావా తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనలు కలుగుతాయట. రాగిజావా లో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి తగిన శక్తి అందించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. రాగిజావాలో కొలెస్ట్రాల్, సోడియం శాతం చాలా తక్కువ ఉంటుంది.
ఇక రాగిజావా లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, వంటి పోషకాలతో పాటు ఫోలిక్ యాసిడ్, రిబోప్లావిన్, వంటి ఏమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వేసవిలో మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.రాగిజావా లో ఉండే ఫైబర్ కారణంగా త్వరగా బరువు తగ్గవచ్చు. ఆలాగే ఊబకాయం బారిన పడకుండా చూస్తుంది. . ఎముకల దృఢత్వానికి, కండరాలు బలంగా తయారు కావడానికి రాగుల్లో ఉండే పోషకాలు ఎంతో అవసరం అవుతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పీచు, అధికంగా ఉంటాయి. అందువల్ల రాగులతో కూడిన ఆహార తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం దురమౌతుంది. రాగుల్లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. ఇక ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలైన ప్రిరాడికల్స్ ను శరీరం నుంచి బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read:రుణమాఫీ ఇప్పట్లో లేనట్లే..?
కి ఇది ఎంతో అవసరం. అందుకే చిన్న పిల్లలకు, వృద్దులకు రాగిజావా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాగుల్లో ఉండే ఇనుము రక్త హీనతను అదుపులో ఉంచుతుంది. అందుకే రాగి మాల్ట్ ప్రేరోజు తాగితే రక్త నాళాల్లో రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. ఇక రాగి జావాలో ఉండే విటమిన్ ఇ వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రాగిజావా అధికంగా తాగితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి మాల్ట్ అధికంగా తాగితే, ఉబ్బరం, గ్యాస్, వాటి వాటితో పాటు డయేరియా వచ్చే అవకాశం ఉందట. కిడ్నీలో రాళ్ళు మూత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రాగి జావా కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.