మన ఉరు-మన బడి.. కేసీఆర్‌కు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు..

68
- Advertisement -

ప్రైవేటు – కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని నిన్న మంత్రి వర్గ సమవేశంలో ముఖ్య మంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీసి సంఘం సుదీర్ఘ పోరాట విజయమన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో గత 9 సంవత్సరాల కాలంలో కొన్ని వందల సార్లు ధర్నాలు, ర్యాలిలు ప్రదర్మనలు, ఇంటర్ మీడియాట్ బోర్డు స్కూల్ డైరెక్టర్రేట్ మట్టడిలాంటి అందోళన కార్యక్రమాలు ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. చివరికు ముఖ్యమంత్రి స్పందించి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఆర్. కృష్ణయ్య.

అలాగే 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం చరిత్రత్మక నిర్ణయం అన్నారు. దీనిమూలంగా 15 లక్షల మంది బీద ఎస్సీ ,ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకోని అభివృద్ధి చెందుతారు. ఇంగ్లీష్ మీడియం మోజులో బీదల వారు ఆస్తులు అమ్మి అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో చదివిస్తున్నారు. దీని మూలంగా సమాజంలో సంఘీక అనిచ్చితి, అసమానతలు వీపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి ఈ విప్లవాత్మకమైన చర్య వలన బీసి కులాల వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందరికీ అందులబాటులోకి వస్తుంది. దీని వలన జ్ఞాన సమాజం ఏర్పడుతుందని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. అయితే ఆయన ఈ విషయంలో కొన్ని సూచనలు చేశారు.

-ఫీజుల నియంత్రణ చట్టంపై ప్రతిపక్షలతో,ప్రజా సంఘంలతో, మేధావులతో, బీసి / దళిత/ గ్రిరిజన/ మైనారిటీ సంఘాలలో చర్చలు జరిపి సమగ్ర చట్టం తయారు చేయాలి. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా ఫీజుల రేట్లను నిర్ణయించాలి.

-ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నందుకు హర్లం వ్యక్తం చేస్తున్నాం. అయితే వెంటనే సరిపోను టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. లేకపోతే ఇంగ్లీష్ మీడియం పెట్టి కూడా ఉపయోగం లేదు.

-ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకురావడం మంచి పరిణామం. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4900 టీచర్ పోస్టులను, ఎస్సీ / ఎస్టీ/ బిసి/ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఖాళీగా ఉన్న 1500 టీచర్ పోస్ట్‌లను, అధర్శ పాఠశాలలో ఖాళీగాయున్న 2 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలని కోరారు. అలాగే జూనియర్ కాలేజ్ లో ఖాళీగా యున్న 5200 జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీలలోని 2100 డిగ్రీ లెక్చరర్స్, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ , ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయ- అధ్యాపక పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తే విద్యా వ్యవస్థ పటిష్ట అవుతుంది. అప్పుడే ఆశించిన లక్ష్యాలు సాదిస్తామన్నారు.

-అలాగే పాఠశాల- కాలేజీలలో మౌళిక సదుపాయాలు కల్పన చాల ముఖ్యమన్నారు. “మన ఉరు- మన బడి” కార్యక్రమానికి విదేశాలలో ఉన్న ఆయా గ్రామాలకు చెందిన ఎన్నారై లతో సంప్రదించి విరాళాలు సేకరించాలన్నారు ఆర్‌ కృష్ణయ్య.

- Advertisement -