సీఎం కేసీఆర్ బీసీ బంధు అని కొనియాడారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బిసి లకు కూడా బిసి బంధు పెడుతా అని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈనెల 23న హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో బిసి ఉద్యోగుల సమావేశం ఉంటుందన్నారు.
బిసి జనగణన వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేటీకరణ వలన బిసి ,ఎస్సి ,ఎస్టీ లకు రిజర్వేషన్లు పోతాయి….బంగారు బాతు మన రైల్వే సంస్థ దాన్ని కూడా ప్రైవేట్ చేస్తున్నారు, ఎల్ ఐ సి ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతుందన్నారు.
ఒడిఎఫ్,తోపాటు హెచ్ ఏ ఎల్ వంటి ఎన్నో ప్రముఖ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తోంది ఈ బిజెపి ప్రభుత్వం అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేట్ చేసి ఉద్యోగుల ను కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారు….బ్యాంకుల కూడా ఎక్కడ నష్టం లేదు,అయిన బ్యాంక్ లను అమ్ముతున్నారని ఆరోపించారు.వెంటనే బిసిల కుల గణన చేయాలి,బిసి కుల గణన ఒక్కటే కాదు అన్ని కులాల గణన చేయాలి…కేంద్ర ప్రభుత్వం ఎందుకు బిసి కులాలకు అన్యాయం చేస్తోందని ప్రశ్నించారు. ఒక్క బిసి మంత్రిత్వశాఖ పెట్టలేని కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు ఉన్న బిసిలకు ఎం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.