ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీని ఓడించాలి- ఆర్ కృష్ణయ్య

213
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బిసి కులస్తుడైన,టిఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. 120 బిసి కులాలు అన్ని కూడ ముక్తకంఠంతో టిఆర్‌ఎస్‌కు వారి మద్దతు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హాటల్‌లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సమావేశమైన బీసీ సంఘాల జేఏసీ నేతలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. తనపై బీజేపీ నేతలు చేసిన విమర్శలపై మండిపడ్డారు. నాకు ప్యాకేజ్ ఉంది అని ఈటల రాజేందర్ అంటున్నాడు. అవును నిజమే నాకు ఏంటి.. బిసిల సంక్షేమం కోసం ఉంది.

బిసిలకు కావాల్సిన అనేక కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అంగీకరించారు. గురుకుల స్కూల్స్ కావాలి అనగానే వెంటనే స్పందించి గురుకుల పాఠశాలలు మంజూరు చేసి స్కూల్స్ పెట్టారు. బిసి బంధు పెట్టాలని అడగగానే పెడుతాం అన్నారు. అసెంబ్లీలో, ప్లీనరీలో బిసి బంధు పెడుతాం అని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు అని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యనించారు.

ఇటీవల పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్ళాను అక్కడ ఉన్న బిసి నాయకులు అంటున్నారు.. తెలంగాణ రాష్ట్రంలో మా జిల్లాను కలపాలని ధర్నాలు,నిరసనలు చేస్తాం మాకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంటే తెలంగాణ జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళను ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ కు వెళ్ళాను.. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలి అని అంటున్నారు. బిసిలకు ఎక్కడ లేనివిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలి అని డిమాండ్ పెరుగుతుంది అన్నారు.

ఇక్కడ రైతులకు రైతు బంధు ఇస్తున్నారు,దళితులకు దళిత బంధు ఇస్తున్నారు.బిసిలకు కావాలి అంటే బిసి బంధు ఇస్తాం అంటున్నారు. సీఎం కేసీఆర్ ఇంత సానుకూలంగా స్పందిస్తే కొందరు ప్రతిపక్ష నాయకులు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేయాలి అంటున్నారు.. ఇదెక్కడి కథ అని ఎద్దేవ చేశారు. బిసి జనగణన చేయాలి అంటే ఇప్పటివరకు దిక్కు లేదు. బిసి మంత్రిత్వశాఖ పెట్టాలి అంటే కూడా ఇప్పటివరకు లేదు. ఒక్క బిసి మంత్రిత్వశాఖ పెట్టని బిజెపి పార్టీ 70 కోట్లు ఉన్న బిసిలకు ఎం చేస్తారు అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.

ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ పార్టీని ఓడించాలని అని ఆయన పిలుపిణిస్తున్నారు.ప్రభుత్వ రంగ కేంద్ర సంస్థలు ప్రైవేట్ కు ధారాదత్తం చేస్తున్నారు. రైల్వేను కూడా ప్రైవేట్ చేస్తున్నారు. ప్రైవేట్ చేయడం వలన బిసిలకు రిజర్వేషన్లు పోతాయి. ప్రైవేటీకరణ అంటేనే రిజర్వేషన్లు తీసేయడం అని అర్థం బీజేపీని విమర్శించారు. మేము భారత మాత ముద్దుబిడ్డలం ఎం చేస్తున్నారు. బిసిలకు బీజేపీని బిచ్చమ్ వేయమని అనడం లేదు. కేంద్రంలో బిసిల మంత్రిత్వశాఖ పెట్టాలి,ఏటా లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. 70 కోట్లు ఉన్న బిసిలకు ముష్టి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టరు ఇదా మీరు ఇచ్చేది అని దుయ్యబట్టారు.

రాజకీయాల్లో కూడా బిసి లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను. మేము న్యాయం కోసం అడుగుతున్నం,మా వాటా కోసం అడుగుతున్నము, మా బిడ్డల కోసం అడుగుతున్నామన్నారు. బిసి పార్టీలో ఉన్న అనేక నేతలు నేను చేసే డిమాండ్‌లకు మద్దతు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో ఎస్సి,బిసి ఎస్టీ హాస్టల్ లు ఉన్నాయి. గురుకుల పాఠశాలలో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఉన్నన్ని స్కిం లు దేశంలో ఎక్కడ లేవు. బిసి ముఖ్యమంత్రిలు ఉన్న దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు,కానీ సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు అని కొనియాడారు.

బిసిల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు సీఎం కేసీఆర్‌.. అందుకే 120 సంఘాలు మద్దతు ప్రకటించాం. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే అభివృద్ధికి పాటుపడుతాడు కానీ వ్యాపారాలు చేయడు.వందల కోట్లు సంపాదించడు. ఎన్నికల సందర్భంగా అనేక మంది నాపై విమర్శలు చేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ బిసి,ఆయన భార్య బిసి,ఆయన పిల్లలు బిసి కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం. పార్టీ పరంగా, ఉద్యమకారుడిగా గెల్లుకు మద్దతు తెలుపుతున్నామన్నారు ఆర్ కృష్ణయ్య.

- Advertisement -