రాజ్యాంగ సవరణకు మద్దతివ్వండి:కృష్ణయ్య

5
- Advertisement -

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు. స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు & రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాట మార్చి పార్టీ పరంగా ఇస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హైకోర్టులో కేసు గెలుస్తుంది కేసు గెలవడానికి బలమైన ఆధారాలు ఉన్నవి అన్నారు.

పార్లమెంటులో ఇండియా కూటమి 240 మంది ఎంపీలు ఉన్నారు. వారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని అందులో భాగంగానే అసెంబ్లీ లో చట్టం చేశారు…ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లిన బీసీల, కేసులు గెలిచే అవకాశం ఉంది అన్నారు.

సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది.. ఇందిరా సహానీ కేసులో ఎంపరికల్ డాటా ఉంటే 50% సీలింగ్ ను అధిగమించవచ్చునని సుప్రీం కోర్టు అభిప్రాయం కూడా ఉన్నది…ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉందని చట్ట ప్రకారము, న్యాయప్రకారము రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు అన్నారు.రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారు.జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలనీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయముకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:కార్తీక మాసం..యాదాద్రికి భారీ ఆదాయం

తెలంగాణ “బంద్” కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అదే విధంగా రాజ్యాంగ సవరణకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయి. దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించడమే శాశ్వత పరిష్కారమన్నారు.

- Advertisement -