గోదావరిని జీవధారగా మారుస్తాం…

178
Question the Congress says KCR?
- Advertisement -

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు ఎస్సారెస్పీ అని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోచంపల్లిలో ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శంకుస్ధాపన చేసి పైలాన్ ఆవిష్కరించిన కేసీఆర్ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు. గోదావరిని జీవధారగా తెలంగాణ జీవధారగామారుస్తామని స్పష్టం చేశారు.

2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత జలసాధన ఉద్యమం చేశామని గుర్తుచేశారు సీఎం.తెలంగాణకు జల కల తీసుకొచ్చేందుకు తొలి విడతగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గోదావరి,కృష్ణ నదుల నుంచి మనకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కాల్సిందేనన్నారు. గత పాలకులు ఇచ్చినవి మోసపూరిత ప్రాజెక్టులేనని చెప్పారు. సమైక్యపాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడే వివరించానని తెలిపారు. శ్రీరాం సాగర్ గడ్డ మీద 1996లో తెలంగాణ ఉద్యమం చేస్తా…సాధిస్తానని చెప్పానని అదే మాట ప్రకారం రాష్ట్రాన్ని సాధించానన్నారు.

ఎస్సారెస్పీకి జవహర్  లాల్ నెహ్రు పునాది రాయి వేసి యాభై నాలుగేళ్లు గడిచిందని కానీ ఇప్పటివరకు ప్రాజెక్టు పూర్తైన పరిస్థితి లేదన్నారు. టీడీపీ,కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కష్టాలు పడ్డామని…కానీ నేడు ఆ పరిస్ధితి లేదన్నారు. ప్రజల అండదండలున్నంత వరకు అభివృద్ధిలో విశ్రమించేది లేదన్నారు.  కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకుండా  అడుగడుగునా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఎస్సారెస్పీ దాని కింద ఉండే ఆయకట్టు బాగుపడాలన్నారు. మోతె గ్రామం ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ సాధించామన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లతో నింపడం ఖాయమన్నారు. ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలను తలపిస్తే తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలుగా మార్చింది ఎవరని ప్రశ్నించారు. ఎస్సారెస్పీలో సినిమా షూటింగ్‌లు జరిగే విధంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.   ఎస్సారెస్పీ కాలువ 110 కిలోమీటర్ల కాలువ ఎప్పుడు నిండే ఉంటుందన్నారు. శ్రీరాం సాగర్‌తో నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.

- Advertisement -