హైదరాబాద్‌కు త్వరలో మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ క్వాల్ కమ్ రానుంది. కోకాపేట ఐటీ క్లస్టర్‌లో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో క్వాల్‌కమ్‌ను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ డైరెక్టర్స్ తెలిపారు.
దాదాపు మూడు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని క్వాల్ కమ్ పెట్టనుంది.10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. 5జీ,మొబైల్,వైర్‌లెస్ టెక్నాలజీలపై ఈ మెగా క్యాంపస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. క్వాల్ కమ్ హెడ్ ఆఫీస్ యుఎస్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో మాత్రమే పెట్టుబడిని పెట్టడం విశేషం.
క్వాల్‌కామ్ రాకపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో నగరానికి మరిన్ని కంపెనీలు రానున్నాయని వెల్లడించారు. పరిశ్రమ అనుకూల ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, నాణ్యమైన మానవ వనరుల లభ్యతను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్‌ను తమ క్యాంపస్ ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నామని క్వాల్‌కామ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ప్రస్తుతం నగరంలో తమ సంస్థ తరఫున నాలుగువేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రాబోయే సంవత్సరాల్లో ఇది 10వేలకు చేరే అవకాశం ఉందని చెప్పారు.