పైథాన్‌తో గుండె జబ్బులకు చెక్!

10
- Advertisement -

ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తీసుకునే ఆహారం కావొచ్చు, మారుతున్న జీవన ప్రమాణాలు కావొచ్చు ఏదైనా హార్ట్ ఎటాక్‌తో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు సంబంధించి ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది.

బౌల్డర్‌లోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పైథాన్‌లపై అధ్యయనం చేశారు. కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ లాంటి గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడతాయని వెల్లడైంది. ఒక పైథాన్‌కు 28 రోజుల పాటు ఆహారం ఏమీ ఇవ్వకుండా ఉంచి, తర్వాత దాని శరీర బరువులో పావు వంతు బరువైన ఆహారాన్ని అందించారు. ఇలా ఆహారాన్ని ఇచ్చినప్పుడు మిగతా పాముల కంటే ఈ పాము శరీరంలో గణనీయ మార్పులు వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

24 గంటల్లో 25 శాతం మేర గుండె వ్యాకోచించిందని, గుండె కణజాలం సైతం మృదువుగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆహారం పూర్తిగా జీర్ణమైన రెండు వారాల తర్వాత పాములోని అన్ని వ్యవస్థలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ గుండె మాత్రం కొంత పెద్దగా, బలంగా మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల గుండెలకు ప్రమాదకరంగా మారే వాటి నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు పైథాన్‌లకు ఉన్నట్టు తెలిపారు.

Also Read:Nepal Bus Accident: నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి

- Advertisement -