ఏపీ బీజేపీ చీఫ్‌గా పీవీఎన్ మాధవ్?

5
- Advertisement -

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాగా ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్‌ ఎంపిక దాదాపు ఖరారైంది. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ పరిశీలకుడిగా వ్యవహరించనుండగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఆయన పేరును అధిష్టానం ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇవాళ మాధవ్ నామినేషన్ దాఖలు చేయనుండగా అధిష్టానం ఆదేశానుసారం ఒక్కరే నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ పేర్లు అధ్యక్ష పదవి రేసులో వినిపించాయి. అయితే, అధిష్టానం మాత్రం మాధవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవరిస్తున్న విషయం తెలిసిందే.

Also Read:తరుణ్ భాస్కర్…’ENE రిపీట్’

- Advertisement -