సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పీవీ సింధు..

84

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మంగళవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు సింధు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పుష్పగుచ్ఛం శాలువాతో పీవీ సింధును ఘనంగా సత్కరించారు. అనంతం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.