ప్రధాని పిలుపుతో రంగంలోకి దిగిన సింధు..

161
pv sindhu

బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి…అప్పుడే గెలుస్తాం..కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి..అప్పుడే గెలుస్తామని పిలుపునిచ్చారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. సామాజిక దూరంతోనే కరోనాపై విజయం సాధించగలమని వీడియోని పోస్టు చేసింది సింధు.

ప్రజలకు సహాయం చేయడానికి 104 హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపిన సింధు…ప్రభుత్వ సూచనలు పాటిద్దాం..కరోనాను కలిసి ఎదుర్కొందామని వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న సింధు..నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి సోషల్ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు చేయాలని తెలపగా ఇందులో భాగంగా ఓ వీడియోని పోస్టు చేసింది సింధు.