ఎంపీ సంతోష్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన పీవీ సింధు..

474
pv sindhu plants sapplings
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే సినీ,రాజకీయాలకు అతీతంగా గ్రీన్‌ ఛాలెంజ్‌లో భౄగంగా మొక్కలు నాటుతుండగా తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముందుకొచ్చారు.

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ని అభినందించిన సింధు…తనని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గోపిచంద్ అకాడమీలో మూడు మొక్కలు నాటిన సింధు…భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ,సినీ నటుడు అక్షయ్ కుమార్,సానియా మీర్జాలను నామినేట్ చేశారు.

థాంక్యూ ఛాంపియన్‌ అంటూ పీవీ సింధు ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు ఎంపీ సంతోష్. గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటడం అభినందనీయమని చెప్పిన సంతోష్…విరాట్,అక్షయ్‌,సానియా మీర్జాలను నామినేట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి మరింత స్పందన వస్తుందని ఆకాంక్షించారు.

pv sindhu pv sindhu pv sindhu pv sindhu pv sindhu

- Advertisement -