PV Sindhu:పీవీ సింధు పెళ్లి తేదీ ఫిక్స్!

3
- Advertisement -

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ వివాహం త్వరలో జరగనుంది. సింధు పెళ్లికి సంబంధించిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఆమె తండ్రి రమణ. డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పీవీ సింధూ, వెంకటదత్త సాయి వివాహం జరగనుందని వెల్లడించారు.

పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు వెంకటసాయి దత్త. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు అని… ఈ వివాహానికి ఇరుకుటుంబాల బంధువులు, స్నేహితులతో పాటు కొందరు సినీ, క్రీడా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సింధూ ఇప్పటి వరకు రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేతగా నిలిచారు.

Also Read:నా అరెస్ట్ విషయంలో మీడియా అత్యుత్సాహం:ఆర్జీవీ

- Advertisement -