వైభవంగా పీవీ సింధు పెళ్లి సందడి

9
- Advertisement -

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు పెళ్లి సందడి మొదలైంది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం రాత్రి 11.30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని రఫల్స్‌ హోటల్లో సంప్రదాయ రీతిలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి 140 మంది అతిథు లు హాజరయ్యారు.

అతిథుల కోసం హోటల్లో 100 గదులు బుక్‌ చేసినట్లు సమాచారం. సింధు తన వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను ఆహ్వానిం చారు.పీవీ సింధు పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం హల్దీ సంబరాలు నిర్వహించగా.. శనివారం మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలను నిర్వహిం చారు.

దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహా నికి వచ్చే అతిథులకు రాజ స్థాన్‌ ప్రత్యేక వంటకాలను రుచి చూపించారు. మంగళవారం డిసెంబర్ 24 నాడు హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు.

Also Read:అల్లు అర్జున్ ఇంటిపై దాడి..!

- Advertisement -