సింధు 50 కోట్ల డీల్..

263
- Advertisement -

నిలకడ లేదు.. ఆమె అంతగా ఆకట్టుకోలేదు” నిరుడు పీవీ సింధుకు వాణిజ్య ఒప్పందాల కోసం కార్పొరేట్‌ సంస్థల వద్దకెళ్లిన బేస్‌లైన్‌ వెంచర్స్‌కు ఎదురైన సమాధానం. సింధు, శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ స్టార్లని కోచ్‌ గోపీచంద్‌ సిఫార్సు చేసినా మారని పరిస్థితి..మరి ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది.ఇప్పుడు ఎక్కడ చూసినా సింధు…సింధు…అభిమానులే కాదు కార్పొరేట్ కంపెనీలు జపిస్తున్న పేరిది. సింధుతో ఒప్పందాల కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ స్టార్ అయ్యింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షెట్లర్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి సింధుకు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి. సన్మానాలు చేశాయి. తాజాగా బేస్ లైన్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ మూడేళ్లకు రూ.50 కోట్ల రూపాయలు చెల్లించి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇది మన నేషనల్ రికార్డ్ కూడానూ. అవును మరి క్రికెటేతర క్రీడల్లో ఓ క్రీడాకారిణికి ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకోవటం విశేషం. బేస్ లైన్ చాలా కంపెనీలకు బ్రాండింగ్, ఇతర సేవలు అందిస్తుంది. బేస్ లైన్ తో స్టార్ట్ అయిన ఎండార్స్ లు.. ఇంకెన్ని తెచ్చిపెడతాయో చూడాలి. కనీసం రూ. 200 కోట్ల రూపాయల విలువైన ఎండార్స్ మెంట్ లు రావొచ్చని అంచనా వేస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.

pv_sindhu

తమతో డీల్ పై సింధూ సంతకం చేసిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ తుహిమ్ మిశ్రా వెల్లడించారు.వచ్చే మూడేళ్లలో సింధూ బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని…బ్రాండ్ ప్రొఫైలింగ్, లైసెన్సింగ్, వివిధ కంపెనీలతో ఒప్పందాలను పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఒక్క పతకం జీవితాన్ని ఎలా మారుస్తుందో.. కోటానుకోట్లను ఎలా సంపాదించిపెడుతోందో అనడానికి సింధు ఎగ్జాంపుల్ అంటున్నారు నిపుణులు.

- Advertisement -