పసిడి పోరులో పీవీ సింధు ఓటమి..

165
pv sindhu
- Advertisement -

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పసిడి పతక పోరులో నిరాశపరిచింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో పీవీ సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియాలోని బాలిలో ఇవాళ జరిగిన ఫైనల్స్‌లో ఆమె ఓడిపోయింది. దక్షిణ కొరియా ఆన్ సేయంగ్ చేతిలో 16–21, 12–21 చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. వరల్డ్ నంబర్ సిక్స్ అయిన సేయంగ్ ఆటకు ఏ దశలోనూ సింధు పోటీ ఇవ్వలేకపోయింది.

నెట్ ప్లే, బేస్ లైన్ గేమ్ తో సింధుకు సేయంగ్ సవాల్ విసిరింది. ఎక్కడ కూడా సింధుకు అవకాశం ఇవ్వకుండా ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. కాగా,డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ లో ఫైనల్ కు వెళ్లడం సింధుకు ఇది మూడోసారి. అంతకుముందు 2018లో సింధు తొలిసారి టైటిల్ ను గెలిచి.. మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

- Advertisement -