సమంతకు సవాల్‌ విసిరిన సింధు..

247
- Advertisement -

హరితహారం కార్యక్రమంలో భాగంగా సాగుతున్న ‘గ్రీన్ ఛాలెంజ్’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్క‌లు నాటుతూ మిగ‌తా సెల‌బ్రిటీల‌కి ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగమైన బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటింది.

Samantha

ఈ క్ర‌మంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన పీవీ సింధు మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని మేరీ కోం, సూర్య, సమంతలకు పాస్ చేసింది. ఈ సంద‌ర్భంగా త‌న‌ని గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్ చేసినందుకు లక్ష్మ‌ణ్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఇక సమంతకు ఇది రెండో గ్రీన్ ఛాలెంజ్.

అంతకుముందు డైరెక్టర్ వంశీ పైడిపెల్లి ఆమెకు ఈ సవాల్ విసరగా.. ఇప్పుడు పీవీ సింధు కూడా ఆమెనే నామినేట్ చేసింది. కాబట్టి అతి త్వరలోనే సమంత రెస్పాన్స్ ఇస్తుందని భావిస్తున్నారంతా. స‌మంత ప్ర‌స్తుతం యూ ట‌ర్న్ చిత్రంతో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చైతూ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాతో బిజీగా ఉంది.

- Advertisement -