బోనమెత్తిన పీవీ సింధు..

424
- Advertisement -

హైదరాబాద్ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పలువురు ప్రజాప్రతినిదులు, రాష్ట్ర మంత్రులు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతూ నగరమంతా బోనాల కార్యక్రమాల్లో సందడిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్టార్ షట్లర్ పీవీ సింధు ఈరోజు బోనమెత్తారు.

PV Sindhu

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తెలుగుతేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు ఈరోజు లాల్‌దర్వాజ సింహవాహని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆమె దేవాలయానికి చేరుకుని అమ్మవారికి మారు బోనం సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనం సమర్పించేందుకు దేవాలయానికి విచ్చేసిన పీవీ సింధుకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు తీర్థప్రసాదాలు అందించి సింధును సత్కరించారు. తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరి వారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104ఏళ్ల చరిత్ర ఉంది.

- Advertisement -