కరోనాపై ప్రజాచైతన్యం అవసరం: పువ్వాడ

332
puvvada ajay
- Advertisement -

కరోనా నేపథ్యం లో ప్రజా చైతన్యం అవసరమన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌.ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన అత్యవసరమైతే తప్ప మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రివ్యూ సమావేశం నిర్వహిస్తాం అన్నారు.

భద్రాచలంలో శ్రీ రామా నవమి ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. స్థానిక పూజారులు మాత్రమే శాస్త్రీయంగా కళ్యాణం నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా ప్రజలు కూడా రాములవారి కళ్యాణం ఆడంబరంగా చేయవద్దన్నారు.

విదేశాలనుండి వచ్చినవారిని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.కొత్తగా ఆడంబరంగా పెళ్లిళ్లు పెట్టుకోవద్దని, పెట్టుకున్నవారు వీలుంటే తక్కువసంఖ్యలో బంధువులను పిలుచుకోవాలన్నారు. ఆన్ లైన్ భద్రాచలం కళ్యాణం టికెట్ల విక్రయాలు కూడా ఆపాలని ప్రయత్నిస్తున్నామని..పరిస్థితులను బట్టి ఇంకా కఠిననిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.

- Advertisement -