కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌ని కావాలనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతోందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని తేల్చి చెప్పారు.
నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షను భరించేందుకైనా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా పోరాడుదామని కేటీఆర్ చెప్పారని…. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:కన్నప్పలో పార్వతీ మాతగా కాజల్