పేదలకు వరం కల్యాణలక్ష్మీ: పువ్వాడ

133
puvvada
- Advertisement -

ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందించిన అనంతరం మాట్లాడిన ఆయన..రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం ఆడపడుచులకు ఓ వరమన్నారు.

ఇప్పటి వరకు 4713 కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌లకుగాను రూ.41.28 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఆడపడుచులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని…. ఖమ్మం నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న 62 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.62.07 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

- Advertisement -