శ్రీనివాస్‌రెడ్డి మృతి కలిచివేసింది:పువ్వాడ

533
puvvada ajay
- Advertisement -

ఖమ్మం జిల్లాలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్.  శ్రీనివాస్ రెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదని …ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. . పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్‌ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

ఆర్టీసీని ప్రైవేటికరణ చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారని కేకే తెలిపారు. అద్దె బస్సులు, ప్రయివేటు స్టేజీ క్యారేజీల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలన్నారు.

puvvada nageshwar rao

- Advertisement -