మొక్కలు నాటండి: పుట్ట మధుకర్

395
madhu green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నూతన దంపతులు ఎడ్ల సతీష్ కుమార్ & జ్యోతి ల చేత మొక్కలు నాటించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మైన్ పుట్ట మధుకర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి , హరితహారం కార్యక్రమానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ పైన , కాలుష్య నివారణ పైన అవగాహనా కల్పిస్తూ , ఇవ్వాల ఎక్కడికి వెళ్లినా , ఏ శుభకార్యక్రమం అయినా కొబ్బరి కాయలు కొట్టే ముందు మొక్కలు నాటుతున్నారు అంటే మొక్కల పెంపకం పైన ఎంత అవగాహ వచ్చిందంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క గొప్ప తనం అర్ధం అవుతుందన్నారు.

ప్రముఖుల చేత మొక్కలు నాటించి , వారి భాగస్వామ్యం తో ప్రజల్లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని తీసుకెళ్లడం లో సంతోష్ గారు విజయం సాధించారు .అందరి చేత మొక్కలు నాటిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు …ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని హరిత తెలంగాణ నిర్మాణం లో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిచారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంథని నియోజకవర్గం లో ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త విధిగా మూడు మొక్కలు నాటి , వాటిని కనీసం మూడు సంవత్సరాలు ఎదిగేలా బాధ్యత తీయనుకోవాలని కోరారు . ఈ కార్యక్రమం లో కొత్త శ్రీనివాస్ గారు , శంకర్ లాల్ ztpc గారు, శంకేశి రవి , టౌన్ ప్రెసిడెంట్ బత్తుల సత్యనారాయణ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -