యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకుంటున్నాడు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మరియు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌ల మధ్య చర్చలు జరిగాయి. యుక్రెయిన్ నాటోలో చేరాలన్న ప్రయత్నం, అలాగే రష్యా ఆక్రమించిన ప్రాంతాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి.
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధంపై జరిగిన ఈ సమావేశంలో, పుతిన్ యుద్ధాన్ని ముగించాలనే సంకేతాలను ఇచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తెలిపారు. జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌లతో పుతిన్ మంచి సమావేశం జరిపాడు. దాని నుంచేంటి బయటకు వస్తుందో ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఒక ఒప్పందానికి రెండు వైపులా సిద్ధంగా ఉండాలి,” అని ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మాట్లాడారు.
యుక్రెయిన్ నాటోలో చేరడం తన భద్రతకు కీలకమని భావిస్తోంది, కానీ రష్యా దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేస్తోంది. అంతేకాక, యుక్రెయిన్ కూడా మాస్కో ఆక్రమించిన భూభాగాలను పూర్తిగా తిరిగి ఇవ్వాలని పట్టుబడుతోంది.భూభాగాల అంశంపై ఏకాభిప్రాయం లేకపోయిందని, ఇంకా వాషింగ్టన్–మాస్కో రెండు వైపులా చాలా పని మిగిలి ఉందని పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరీ ఉషకోవ్ తెలిపారు.
ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు కొంతకాలంగా చర్చలు కొనసాగిస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అది పుతిన్ డిమాండ్లను భాగంగా అంగీకరించిందని వారు భావిస్తున్నారు. అయితే, అమెరికా పథకాన్ని పుతిన్ తిరస్కరించలేదని, చర్చలు కొనసాగుతున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.
Also Read:పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ హ్యాక్!

