పది మంది బాబులకు..13లక్షల రివార్డ్‌ ఎక్కడో తెలుసా..!

118
putin
- Advertisement -

ప్రపంచ జనాభా తగ్గిపోతోంది.. ఇప్పుడు ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు.. జనాభాను పెంచే మార్గాలపై దృష్టిసారించాయి. ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్దది అయినా జనాభాలో మాత్రం బ్రెజిల్‌ కంటే తక్కువగా ఉన్న దేశం. తాజాగా తీవ్ర సంక్షోభంను ఎదుర్కోంటుంది. కాగా ప్రస్తుతం ఆ దేశం దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఫలితాలు ఇప్పట్లో కనపడవుంటున్నారు డెమోగ్రాఫర్.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ కాలం నాటి ‘మదర్ హీరోయిన్’ అవార్డును పునరుద్ధరించారు. ఎందుకంటే దేశం జననాల రేటు తగ్గడం, ప్రస్తుత అవసరాల మేర ఆదాయం తగ్గిపోవడం వంటి కారాణాల వల్ల రష్యా జనాభా తీవ్ర సంక్షోభంతో పోరాడుతోంది. ఈ సంక్షోభంను ఎదుర్కొవడానికి పుతిన్‌ ప్రభుత్వం మదర్‌ హీరోయిన్‌ అనే గౌరవ బిరుదును పునరుద్ధరిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా రాజకీయ, భద్రతా దళ నిపుణుడు డాక్టర్‌ జెన్నీ మాథర్స్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సోమవారం పుతిన్‌ సంతకాలు చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే మరియు పెంచే మహిళలకు ‘మదర్ హీరోయిన్’ టైటిల్ ఇస్తారు. ప్రస్తుత పుతిన్ డిక్రీ ప్రకారం మదర్ హీరోయిన్స్ వారి పదవ బిడ్డకు ఒక సంవత్సరం నిండిన వెంటనే 1 మిలియన్ రూబిళ్లు సుమారుగా మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 13.27 లక్షలు మొత్తంను వన్-టైమ్ పేమెంట్ ఇవ్వబడుతుందని డిక్రీలో పేర్కొన్నారు.

జూన్ 1న రష్యా బాలల దినోత్సవం సందర్భంగా మదర్ హీరోయిన్ టైటిల్ పునరుద్ధరణను పుతిన్ మొదట ప్రతిపాదించారు. రష్యా యొక్క జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కార్డినల్ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలు రష్యన్ సమాజంలో క్రమంగా పునరుద్ధరణను చూస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు.

పుతిన్ దేశభక్తి ప్రయత్నాలు వర్కవుట్‌ అయ్యేవి కావని డాక్టర్‌ మాథర్స్‌ అంటున్నారు. ఎందుకంటే.. పదవ బిడ్డ పుట్టిన తర్వాతే అదీ మిగతా తొమ్మిది మంది బిడ్డల ఆరోగ్య స్థితి బాగా ఉంటేనే ఈ ప్రైజ్‌ మనీని, మదర్‌ హీరోయిన్‌ ట్యాగ్‌ను సదరు తల్లికి అందిస్తారు. దీంతో ఆ ప్రైజ్‌ మనీ కోసం అంతమంది పిల్లలను పోషించడం.. కుటుంబాలకు భారం కావొచ్చనే చర్చ నడుస్తోంది. అప్పటి, ఇప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుంటే.. మదర్‌ హీరోయిన్‌ ఇప్పుడు విఫలం కావొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత మదర్‌ హీరోయిన్‌ పథకం రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా జనాభాను నష్టపోవడం వల్ల అప్పట్టి అధ్యక్షుడు స్టాలిన్‌ తొలిసారిగా ఈ పథకంను ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రష్యా జనాభా కూడ పెరిగిపోయింది. కానీ సోవియట్‌ రష్యా 1991లో పతనం తర్వాత జనాభా క్రమంగా క్షీణిస్తోంది. 2022 నాటి ప్రారంభంలో దాదాపు 400,000 వరకు క్షీణించగా ప్రస్తుతం 145.1మిలియన్లకు జనాభా పడిపోయిందని…ముఖ్యంగా కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి కారాణాల వల్ల రష్యా జనాభా తగ్గిందని పలు నివేదికలు తెలిపాయి.

- Advertisement -