Putin:ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్

6
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో పుతిన్, ట్రంప్ లమధ్య గతకొంతకాలంగా విభేదాలు ఉండగా రష్యాను దెబ్బతీయాలని భారత్- రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించాలని ఆదేశించారు ట్రంప్.

ఈ నేపథ్యంలో అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు. దీనిపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఇప్పటివరకు ఆగి ఉన్న అణు అగ్గి రాజుకున్నట్టయింది. 2000 సంవత్సరంలో రష్యాతో ది ప్లుటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్ పొజిషన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. దీనిప్రకారం యుద్ధాలు జరుగుతున్నప్పుడు తన దగ్గర నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియాన్ని అణ్వాయుధాల తయారీకి కాకుండా కేవలం పౌర అణు విద్యుత్ కోసం మాత్రమే వాడాలి.

ఈ ఒప్పందాన్ని 2010లో మళ్లీ సవరించారు కూడా. దీని ద్వారా దాదాపు 17వేల అణ్వాయుధాల తయారుకాకుండా అడ్డుకున్నట్లు అవుతుందని అమెరికా లెక్కలు వేసింది. తాజాగా దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు పుతిన్.

Also Read:ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు

- Advertisement -