రష్యాలో అత్యంత ప్రభావవంతమైన, అల్ట్రా- నేషనలిస్ట్ తత్వవేత్తగా పేరుపొందిన అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె మాస్కో శివార్లలో కారు బాంబు దాడిలో మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం జరిగినట్లు ఫోరెన్సిక్ పేలుడు నిపుణులు తెలిపారు. ఈ సంఘటన బోల్షియో వ్యాజిమి అనే గ్రామం వద్ద జరిగినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన అలెగ్జాండర్ కూతురైన దర్యా దుగినాగా దృవీకరించారు.
దుగినా తండ్రి ఒక రష్యన్ రచయిత మరియు సిద్ధాంతకర్త, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వాస్తుశిల్పి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఘనత పొందారు. అతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడని మరియు ఫారిన్ అఫైర్స్ మ్యాగజైన్ ద్వారా పుతిన్స్ బ్రెయిన్ గా అభివర్ణించబడ్డారు. ఈ కారు బాంబును అలెగ్జాండర్ కోసమని చివరి నిమిషంలో షెడ్యూల్‌లో మార్పు వల్ల ఆ కారులో తను ఉందన్నారు. దీంతో మాకు ఏలాంటి సంబంధం లేదని జెల్‌న్‌స్కీ సహయకుడు కూడా ప్రకటించారు. మేం ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామన్నారు.