ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం తారాస్ధాయికి చేరింది. రష్యా దాడితో ఉక్రెయిన్ అట్టుడికిపోగా ప్రజలు తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని బ్రతుకుతున్నారు. ఇక ప్రపంచ దేశాల నుండి రష్యాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుండగా ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్ రష్యా అణ్వస్త్ర నిరోధక విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా దళాలు కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
మ్రియా అంటే అర్థం కల అని… దానిని కూల్చేశారు అని తెలిపింది ఉక్రెయిన్. అతిపెద్ద ఎయిర్‌లిఫ్ట్ కార్గో.. ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో 80వ దశకంలో(సోవియట్ యూనియన్‌లో ఉండగానే) డిజైన్ చేసింది. 1985లో ఏఎన్-225 సిద్ధం కాగా.. మూడేళ్ల తర్వాత కార్యకలాపాలను మొదలుపెట్టింది.