Putin:ఉగ్రదాడికి పాల్పడింది ఐసీసే

16
- Advertisement -

రష్యాలోని కన్సర్ట్ హాల్‌లో ఉగ్రదాడికి పాల్పడింది ఐసీస్ ఉగ్రవాదులేనని తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మీడియాతో మాట్లాడిన ఆయన..ఉక్రెయిన్ లబ్ది కోసమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఉగ్ర‌వాద దాడితో ఉక్రెయిన్‌కు సంబంధం లేద‌ని అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని, కాల్పులకు పాల్పడింది ఎవరో తెలిసిందని, కానీ ఇప్పుడు వారి వెనకున్న దేశాలు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో 130 మంది మరణించారని, వందల సంఖ్యలో గాయాలబారిన పడ్డారని వెల్లడించారు. ఇక ఈ ఘటనలో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వారిని విచారిస్తున్నట్లు చెప్పారు.

Also Read:Gold price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -