పుష్ప లోకేషన్ల కోసం వేట..!

28
puspa
- Advertisement -

ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెలుగులో హిట్‌గా నిలిచిన సినిమా పుష్ప. ఇక రెండవ భాగంలోని సినిమాకు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలైన తర్వాత భారీ వసూళ్లు కూడా సాధించింది.

రెండవ భాగంలో మరి కొంత మంది స్టార్ల్‌ యాడ్‌ అవుతారాని టాలీవుడ్‌ టాక్‌. కాని సినిమా రెండవ భాగంలో లోకేషన్ల్‌ తో సతమతవుతున్నారు అ చిత్ర యూనిట్‌. లొకేషన్స్ విషయంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే అందుకు కారణమని తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. నిజానికి మొదటి భాగాన్ని ముందుగా థాయ్ లాండ్ తరువాత కేరళలో షూట్ చేయాలని అనుకున్నా అప్పటి కరోనా పరిస్థితుల రీత్యా ఎక్కువ మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారు. ఇప్పుడు అదే లొకేషన్స్ లో షూటింగ్ జరపాలంటే ఆ ఫారెస్ట్ రేంజ్ లో విపరీతమైన వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ అనేది కష్టమైన విషయమని భావిస్తున్నారు. అలాగే సుకుమార్ ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే మొదటి భాగాన్ని చిత్రీకరించిన అదే లొకేషన్లలో మళ్ళీ షూట్ చేస్తే లొకేషన్స్ రిపీట్ చేసిన అనుభూతి కలుగుతుంది. ఇక గతంలో కరోనా కేసులు కారణంగా కేరళ అడవుల్లో చేయాల్సిన షూటింగ్ ఇక్కడ మారేడుమిల్లి అడవిలో జరిపారు. అలాగే థాయిలాండ్ అడవుల్లో కూడా షూటింగ్ జరపాలని భావించారు కానీ కరోనా కాలంలో అంత మందికి వీసాలు దొరకడం కష్టమని భావించి వెనకడుగు వేశారు. మరికోన్ని రోజుల్లో తెలుస్తుంది. షూటింగ్‌ ఎక్కడ అనేది..? కాని మొత్తానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పుష్ప” ద రూల్‌”….

- Advertisement -