స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 సినిమాపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాక ముందే ఓటీటీ హక్కుల కోసం బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ అలాగే మరో సంస్థ పుష్ప సెకండ్ పార్ట్ ఓటీటీ హక్కుల కోసం భారీ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ బడా కంపెనీ భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చిందని సమాచారం.
సినిమాకు సంబంధించిన షూటింగ్‌పై ఇంకా ఒక అప్‌డేట్ రాలేదు. అప్పుడే సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన డీల్స్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ అయితే చాలా ఎక్కువ స్థాయిలో ఆఫర్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వరకే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు పుష్ప రెండవ భాగం కోసం కూడా ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్ట్ వన్ అమోజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి బిజినెస్ లెక్కలు మారిపోయాయి. అందుకే కేవలం హిందీ హక్కులు దొరికినా కూడా నెట్‌ఫ్లిక్స్ అయితే వదులుకోవాలని అనుకొవడం లేదు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక మరోసారి చర్చల అనంతరం ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాలివుడ్ టాక్.