రేపటి నుండి పుష్యమాసం..చరిత్ర ఇదే

0
- Advertisement -

ప్రస్తుతం మనం సార్వత్రికంగా అనుసరిస్తున్నటువంటి ఇంగ్లీష్ నెలలు జనవరి,ఫిబ్రవరి, మార్చి మొదలగున నెలలకు సంబంధించిన విషయంలో ప్రమాణం లేదు. అవి కేవలం రాజుల పేర్లతోనూ , ఇతర అంశాలతోనూ కుడుకున్నాయి. అయితే తెలుగు నెలలు మాత్రం చాంద్రమానాన్ని అనుసరించి భారతీయ జ్యోతిష్కుల విషయంలో మాసాలకు ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ప్రతినెలలోనూ పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ప్రత్యేకం. ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసం.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయ్యే మాసం. ఈ మాసం అనేక విశేషాలతో కూడుకుని ఉన్నది. వాస్తవానికి దీన్ని శూన్యమాసం అని అంటారు.

పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోష రహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. విశేషమేమంటే దక్షిణాయణం పుష్య మాసంతో ముగుస్తుంది. ఉత్తరాయణం కూడా పుష్య మాసంలోనే ప్రారంభమవుతుంది. పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం.ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి.ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపు తున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు.హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం,ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈరెండు పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే.

మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు.దక్షిణాయణానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగ చైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము.ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును.మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.

Also Read:New Year: సైబర్ కేటుగాళ్ల కొత్త ప్లాన్..లింక్ క్లిక్ చేస్తే అంతే!

పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు.

- Advertisement -