TTD: 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

0
- Advertisement -

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నవంబర్ 9వ తేదీ శనివారం పుష్పయాగ మహోత్సవం జరగనుంది. పుష్పయాగం కోసం అంకురార్పణం నవంబర్ 8 శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య జరుగుతుంది.పుష్పయాగం రోజు ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపానికి తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పూలు, ఆకులతో ఉత్సవ పుష్పయాగం నిర్వహిస్తారు.

సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.నవంబర్ 8న సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.నవంబర్ 9న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు రద్దు చేయబడ్డాయి.

న‌వంబ‌రు 8న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. న‌వంబ‌రు 9న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Also Read:Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా

- Advertisement -