అల్లు అర్జున్ – సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. పుష్ప తర్వాత ఈ కాంబినేషన్ లో మళ్లీ సీక్వెల్ రాబోతుంది. పైగా పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందుకే, ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న పుష్ప 2 పై బన్నీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ న్యూ లుక్ లో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనా మరోపక్క స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని టీమ్ భావిస్తోంది. దాంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడే ఛాన్స్ ఉందట. అయితే ఈ లోపు ఈ చిత్రం పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2 యాక్షన్ ఎంటర్ టైనర్ అని కొందరు.. కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరి కొంతమంది అంటున్నారు. తాజాగా పుష్ప 2 గురించి మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాని తమిళనాడులోని తిరువన్నమలై బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథతో సుకుమార్ ఈ సినిమాని సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లోని ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూనే రమణ మహర్షి భావాలను కూడా బన్నీ పాత్రలో సుకుమార్ జోడించాడు. ఈ కోణంలో కొత్తగా కథలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. పుష్ప 2 పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి…