TTD: పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

9
- Advertisement -

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీ శుక్రవారం జ‌రుగ‌నున్న‌ పుష్పయాగానికి గురువారం సాయంత్రం 6.30 నుండి సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

శుక్రవారం ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం జరుగనుంది.

Also Read:వైజాగ్‌లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం

- Advertisement -