పుష్ప తగ్గేదేలే! షూటింగ్‌ ప్రారంభం ….

19
pushpa
- Advertisement -

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపించిది. దాంతో సీక్వెల్‌ తీసే అలోచన ఉన్నట్టు చిత్ర బృందం చేప్పడంతో…ప్రేక్షకుల్లో అంచనాలు మరింత రెట్టింపైనాయి. దీంతో సెకండ్‌ పార్ట్‌ కథ కూర్పు కోసం చిత్ర బృందం ఇనాళ్లు ఆగింది. కానీ బాలీవుడ్‌లోని స్టార్ల్‌ దీనిలో నటిస్తున్నట్టు సినీ వర్గాల్లో పుకార్లు షీకార్లు చేశాయి. అన్ని రెడీ అయినట్టు దాంతో షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 22న నుంచి సెకెండ్‌ పార్ట్‌ మూహూర్తం పెట్టుకుంటున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇదే రోజు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులు అటు ఐకాన్‌ స్టార్‌ బన్నీ అభిమానుల అనందానికి అవధులేకుండా పోయందని సినీ వర్గాల టాక్‌.

క్రియోటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్‌ దగ్గర తగ్గేదేలే అంటూ ప్రేక్షకులను ఇట్టే కట్టిపారేసింది. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా చేసింది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఒక కొత్త ట్రెండ్‌ చేసింది. ఇంకా వీటితో పాటు సమంత ఉ అంటవా పాట ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలుగించింది. ఆగస్టు 22న సినిమా పూజ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా…రెగ్యూలర్‌గా సెప్టెంబర్‌ 15నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కాగా పుష్ప2 ది రూల్‌ కోసం సూమారుగా రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించునున్నట్లు ఇండస్ట్రీలో ఆమధ్య టాక్‌ వినిపించింది.

- Advertisement -