‘పుష్ప’ ఫస్ట్‌ సింగిల్‌కు డేట్ ఫిక్స్..!

83

‘అల.. వైకుంఠపురములో’ భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మొద‌టి భాగం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న‌ట్లు తెలుస్తోంది. కాగాఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌లో అల్లు అర్జున్ క‌న‌ప‌డిన తీరు అదుర్స్ అనిపించింది.

అయితే దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఈ చిత్ర బృందం తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. పుష్ప సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక‌.. పులొచ్చి కొట్టుద్ది పీక.. హుయ్’ అంటూ సాగే పాటను ఆగ‌స్టు 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పాట లిరిక్స్ ఆయా భాష‌ల్లో ఎలా ఉండ‌నున్నాయ‌న్న విష‌యాన్ని దేవిశ్రీ ప్ర‌సాద్ తెలిపాడు. ఆయ‌న‌కు అల్లు అర్జున్ స‌హా పుష్ప సినిమా యూనిట్ అంతా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది. ఆ పాట‌ దుమ్ములేపేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ద్వారా సుకుమార్, అల్లు అర్జున్ చేసే మేజిక్ చూడ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నామ‌ని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.