పుష్ప 2..సాంగ్ ప్రొమో అదుర్స్

20
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ సాంగ్‌ ప్రొమోని రిలీజ్ చేశారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. పూర్తి సాంగ్‌ని మే 1న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ రూ.200 కోట్లకు అమ్ముడుపోగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.

Also Read:మోడీ ప్రసంగంపై అభ్యంతరం..ఈసీకి ఫిర్యాదులు

- Advertisement -