‘పుష్ప’ ప్రీ రిలీజ్‌కు ముహుర్తం ఖరారు..

27

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుకుమార్ ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఎవరు రానున్నారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చాడు. ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.