రికార్డులు బ్రేక్‌ చేస్తున్న ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్..

165
Allu Arjun
- Advertisement -

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను వదిలారు మేకర్స్‌. ‘దాక్కో దాక్కో మేక .. ‘ అంటూ ఈ పాట కొనసాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శివమ్ ఆలపించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ కథ అడవి నేపథ్యంలో సాగుతుంది.. అందువలన ఆటవిక న్యాయాన్ని గురించి చెబుతూ ఈ పాట నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బీట్‌తో పాటు, కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అయితే మేకర్స్‌ వదిలిన ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 182 నిమిషాల్లోనే 400K లైక్స్ ను సాధించింది. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకూ ఇంత వేగంగా.. ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ ని సాధించిన లిరికల్ వీడియో ఇదేనని చెబుతున్నారు. ఫస్టు సింగిల్ తోనే కొత్త రికార్డును సాధించిందని అంటున్నారు, అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.

- Advertisement -