‘పుష్ప 2’ ట్రైలర్‌ మరో రికార్డు..!

6
- Advertisement -

‘పుష్ప 2’ ట్రైలర్‌ హంగామా కొనసాగుతోంది. తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. 150 మిలియన్‌కి పైగా వ్యూస్‌, 3 మిలియన్‌కి పైగా లైక్స్‌ సాధించింది. ప్రస్తుతం.. యూట్యూబ్‌ (ఇండియా) ట్రెండింగ్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. సంబంధిత పోస్టర్‌ పంచుకుంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా ఇది నిలిచిన సంగతి తెలిసిందే. విజువల్స్‌, యాక్షన్‌, డైలాగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ట్రైలర్‌ ఎంతగా అలరించిందో దాని విడుదల కోసం పట్నాలో నిర్వహించిన వేడుక సైతం ఆకర్షించింది. ఈవెంట్‌ను, తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు రెండున్నర లక్షకుపైగా అభిమానులు వెళ్లడం గమనార్హం. ఆన్‌లైన్‌లోనూ అత్యధిక మంది చూసిన ఈవెంట్‌ ఇదేనని టీమ్‌ పేర్కొంది. తదుపరి ఈవెంట్‌ను ఈ నెల 24న చెన్నైలో నిర్వహించనుంది . అదే రోజు రాత్రి 7:02 గంటలకు స్పెషల్‌ సాంగ్‌ ‘కిస్సిక్‌’ (kissik song)ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్‌, కన్నడలో గాయని సుబ్లాషిణి ఈ పాటను ఆలపించినట్టు చిత్ర బృందం తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. మరికొన్ని నగరాల్లోనూ వేడుకలు ప్లాన్‌ చేశారు.

‘ఆర్య’, ‘ఆర్య 2’లతో లవ్‌ స్టోరీలు చెప్పి క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్‌ (Sukumar)- నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) కాంబో ‘పుష్ప 1’తో యాక్షన్‌ బాట పట్టింది. ఎర్ర చందనం అక్రమ రవాణా ఇతివృత్తంగా రూపొందిన ఆ సినిమా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టడంతోపాటు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, పార్ట్‌ 2పై సినీ ప్రియుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సుకుమార్‌ పక్కాగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి అంతకుమించి అని ‘పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటిరా.. ఇంటర్నేషనలు’ డైలాగ్‌తో చెప్పకనే చెప్పారు. డిసెంబరు 5న పుష్పరాజ్‌ రాబోతున్నాడు.

Also Read:వయనాడ్..కాంగ్రెస్‌దే

- Advertisement -