AA: పుష్ప అంటే వైల్డ్ ఫైర్

1
- Advertisement -

 ఇంతటి అభిమానాన్ని మేము పాట్నా నుండి అస్సలు ఊహించలేదు అన్నారు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ . ఒకరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం ఇంతటి విజయవంతమైన ప్రయాణం కావడానికి ముఖ్య కారణం అయిన స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్. అంతేకాకుండా చిత్రంగా పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేసారు. దానికి నాకు ఎంత సంతోషంగా ఉంది.

మైత్రి మూవీ మేకర్ రవి : మేము ఇప్పటికీ ఎన్నో చిత్రాలను చేశాము. ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాము. కానీ ఒక ట్రైలర్ను ఇలా విడుదల చేయడం అనేది మొదటిసారిగా జరుగుతుంది. పాట్నా నుండి ఇంతటి అభిమానాన్ని మేము ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. డిసెంబర్ 5తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గత పది సంవత్సరాల్లో ఇంతటి పెద్ద యువతను చూడటం ఇదే తొలిసారి.

అల్లు అర్జున్ ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తితో పనిచేయడం మాకు ఇంత సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈవెంట్ ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం పాట్నా పోలీసులు. ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి పేరుపేరునా ధన్యవాదాలు.

బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ : పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని బీహార్ లోని పాట్నాలో నిర్వహించడం నాకు ఎంత సంతోషంగా ఉంది. బీహార్ ప్రభుత్వం తరఫున అలాగే ముఖ్యమంత్రి గారి తరపున చిత్ర బృందానికి మా కృతజ్ఞతలు అందజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇలా విజయం సాధించడానికి తోడ్పడిన పోలీసులు, అభిమానులు అందరూ కలను, కళాకారులను సపోర్ట్ చేసేవారు కావడం సంతోషకరం. ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా వచ్చినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటాము. ఈ చిత్ర బృందానికి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలు.

హీరోయిన్ రష్మిక మందన్న : అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను పుష్ప శ్రీవల్లి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం. ఎప్పుడు పాట్నా వచ్చినా మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతోంది. చాలా చాలా ధన్యవాదాలు. అందరూ ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్. నా హిందీ కాస్త మీకు ఇబ్బంది కరంగా ఉండొచ్చు. నన్ను క్షమించగలరు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు థ్యాంక్యూ. దేశం మొత్తానికి థ్యాంక్యూ. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు థ్యాంక్యూ. ఇది నా గొప్పతనం కాదు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఈ సందర్భంగా పుష్ప టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. ‘పుష్ప’ను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. స్పాన్సర్స్‌కి, పోలీస్ సిబ్బందికి, అభిమానులందరికీ థ్యాంక్యూ. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా.. అని అన్నారు.

అభిమానులు డైలాగ్ చెప్పమని అడగగా..‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల ముచ్చట తీర్చారు మన ఐకాన్ స్టార్.

ALso Read:మొట్టమొదటి మహిళా బస్ డిపో

- Advertisement -