పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతోపాటు అర్థరాత్రి 1 గంట షోకు అనుమతి ఇచ్చింది. అలాగే పుష్ప2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 కాగా రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు టికెట్ ధరలు రూ.800 గా ఉన్నాయి.
అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతిచ్చింది సర్కార్. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపుకు ఓకే చెప్పింది.
డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇవ్వగా డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతించింది సర్కార్.
Also Read:డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం సభ