పుష్ప 2..మేలో మరో సర్‌ప్రైజ్!

27
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌.

రీసెంట్‌గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు అదిరే రెస్పాన్స్ వచ్చింది. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. ఇక తాజాగా పుష్ప 2 నుండి మరో అప్‌డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఇక మే ఫస్ట్ వీక్ లో మేకర్స్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన అప్డేట్ త్వరలో రానుందట. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:కాజల్ అగర్వాల్.. “సత్యభామ” రిలీజ్ డేట్

- Advertisement -