Pushpa 2:సెకండ్ సాంగ్ వచ్చేసింది

14
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. సెకండ్ సాంగ్‌లో కూడా బన్నీ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి కలెక్షన్స్ తో అదరగొట్టి, నేషనల్ అవార్డు సాధించిన బన్నీ పుష్ప 2తో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.

Also Read:NKR21లో రాములమ్మ!

- Advertisement -